telangana
ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు
సూర్య లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్ల వద్ద దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని లింగంపేట్ సర్పంచ్ కౌడ రవీందర్ తెలిపారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదింటి కల సాకారం చేసిందన్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయడంతో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అందంగా నిర్మాణ చేసుకున్నారని పేర్కొన్నారు.దీపావళి పండగ పురష్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న లబ్ధిదారుల ఇండ్లలో వెలుగులు నిండాలని దీపావళి సంబరాలు జరిపి టపాసులు,కాల్చి దీపావళి వేడుకలు జరిపామన్నారు.లింగంపేట్ సొసైటి చైర్మన్ బుర్ర నారగౌడ్,ఎంపివో మలహరి,ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడ గడియారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ మండల అధ్యక్షుడు వంజరి ఎల్లమయ్య,ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా బాల్ కిషన్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాహబ్,పర్శరాములు,సొసైటీ డైరక్టర్ లక్ష్మి నారాయణ,పాలకవర్గ సభ్యులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.