telangana
గోవర్ధన గిరి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కొంపల్లి మేజర్ న్యూస్ 126-జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్టలో ఉన్న పరశురాముడి దేవాలయంలో నిర్వహించిన గోవర్ధన గిరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై పరశురాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గ ప్రజలపై దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, ఆధ్యాత్మికతతో నిర్వహించే పూజా కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు. గోవర్ధన గిరి పూజా కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, దేవాలయ అధ్యక్షుడు సౌరవ్ సింగ్, కమిటీ సభ్యులు సునీల్ సింగ్, మోహన్ సింగ్, పంకజ్ సింగ్, ముఖేష్ శర్మ, బోలా సింగ్, బిత్తిన్ బిహారీ, టెంపుల్ చైర్మన్ రాంభూపాల్ చౌదరి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.