BREAKING
ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా భారతీయ సినిమాకు బాలీవుడ్ అందించిన చరిత్రాత్మక సేవలు: మూలాలు మొదలు ఆధునిక మార్పుల వరకు! గిద్ద పెరుమాండ్ల టెంపుల్‌లో జమ్మి పూజలో పాల్గొన్న ఆకుల నరసన్న పటేల్ 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి వైరల్ కావడమే నేటి యువత పరమావధిగా మారిందా: సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక ఉన్న చేదు నిజాలు! ఓటీటీల హవా ప్రభావం: చిన్న సినిమాలకు సువర్ణావకాశమా లేక థియేటర్లకు పెను ముప్పు ? ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ

గోదావరి నదిలో నీళ్లు కరువు.. మురికికుంటలో నిమజ్జనానికి నిరాకరణ

Select Suryaa Now
గోదావరి నదిలో నీళ్లు కరువు.. మురికికుంటలో నిమజ్జనానికి నిరాకరణ

సూర్య-గోదావరిఖని:దుర్గాదేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనానికి గోదావరి నదిలో నీరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రత్యామ్నాయంగా ప్రశాంతినగర్‌ సమీపంలోని కుంటలో రామగుండం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేయగా, ఆ నీరు మురికిగా ఉందంటూ భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం గోదావరిఖని మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శుద్ధమైన నీటిలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసేంతవరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపివేస్తామని నాయకులు హెచ్చరించారు. మరోవైపు, నిమజ్జనం ఆలస్యమవుతుండటంతో కార్యక్రమం ఎటువైపు దారితీస్తుందోనన్న అయోమయం నెలకొంది. విగ్రహాలను ఎక్కువసేపు నిమజ్జనం చేయకుండా ఉంచితే అశుభం జరుగుతుందేమోనని కొందరు భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిశుభ్రమైన నీటితో నిమజ్జన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
--------