BREAKING
ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

ఘనంగా మహిళా కార్మికుల బతుకమ్మ వేడుక

Select Suryaa Now
ఘనంగా మహిళా కార్మికుల బతుకమ్మ వేడుక

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :మహిళా కార్మికుల ఆధ్వర్యంలో ​ హిమాయత్‌నగర్‌లోనీ ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన శ్రామిక మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
​ఈ సందర్భంగా ఎం. నరసింహ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రకృతితో పాటు శ్రమజీవుల జీవన విధానంతో ముడిపడి ఉన్న విశిష్టమైన ఉత్సవమని కొనియాడారు. బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.కార్మిక మహిళల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి ఏఐటీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎం. నరసింహ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి ప్రేమ్ పావని, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం, కమతం యాదగిరి,ఎం ఎస్ మూర్తి, రాష్ట్రనాయకులు ఎం లక్ష్మీబాయి, ఏ పార్వతి, జె లక్ష్మి, బురనా, కరుణ కుమారి,కృష్ణవేణి, చంద్రమ్మ, కార్మిక సంఘాల ప్రతినిధులు , పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.