BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

ఎస్టీలను ఏ బి సి డి లుగా వర్గీకరించాలి

Select Suryaa Now
ఎస్టీలను ఏ బి సి డి లుగా వర్గీకరించాలి

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : ఎస్టీల్లోని ఉప తెగల అభివృద్ధి కోసం ఏబిసిడి లాగా వర్గీకరించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించి ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా ఎరుకల వ్యక్తిని నియమించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ను గోండు, కోయ, లంబాడీలు మాత్రమే ఉపయోగించు కుంటున్నారని ఆవేదన చెందారు. కార్పొరేషన్ లోన్లకు బ్యాంకు తో సంబంధం లేకుండా రూ .12 లక్షల ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎరుకల ఎంపవర్మెంట్ జీవోను ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పదవుల్లో తమకు అవకాశాలు కల్పించాలని సూచించారు. ములుగు లోని ఎరుకల నాంచారమ్మ గుడిని పునర్నిర్మించాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. ఎరుకల భాష రక్షణకు అకాడమీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకినీ గోపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కిరణ్ గ్రేటర్ అధ్యక్షుడు, రాజ్ కమల్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి లుగా నియమిస్తూ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కుతాటి రవికుమార్, సలహాదారులు గుడిపల్లి రవి, మహిళా అధ్యక్షురాలు సరళ కేం సాగరం, ఉపాధ్యక్షులు రాజు, రమేష్, శ్రీరామ్ ఆనంద్ ,దేవరాయ యాదగిరి, నరసింహ, రమేష్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.