BREAKING
ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

Select Suryaa Now
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
సూర్య నిజామాబాద్ అర్బన్ : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్తా డిమాండ్ చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు.  ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు స్టేట్ హెల్త్ సొసైటీ (ఎస్‌హెచ్‌ఎస్) ద్వారా స్పర్శ్ విధానంలో వేతనాలు చెల్లించాలని, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐదు శాతం ఇంక్రిమెంట్‌తో పాటు ఎనిమిది శాతం వార్షిక వేతన పెంపును అమలు చేయాలని కోరారు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సెలవుల సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగులకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈహెచ్‌ఎస్‌, ఈఎస్‌ఐ వైద్య సదుపాయాలు కల్పించాలని, గర్భిణీ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు సహా అర్హులైన సిబ్బందికి తగిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, ఏరియర్స్ బకాయిలను చెల్లించడంతో పాటు జీవో నంబర్ 60, 1195 ప్రకారం అర్హులైన ఉద్యోగులకు వేతన సవరణ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
   ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని, వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గణేష్ బిగాల పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.