ఈనెల 3నుండి నట్టల నివారణ (డీవార్మింగ్) కార్యక్రమం
*కడ్తాల్, నవంబర్ 02 :*
కడ్తాల్ మండలంలోని అన్ని గ్రామాల్లో దూడలకు నట్టల నివారణ (డీవార్మింగ్) కార్యక్రమం నవంబర్ 3 నుండి 7 వరకు నిర్వహించనున్నట్లు మండల పశు సంవర్ధక శాఖ అధికారి డా. భాను నాయక్ కేతావత్ తెలిపారు.
పశు ఆరోగ్య మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (LHDCP) మరియు ASCAD పథకాల కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మండలంలో సుమారు 500 దూడలకు నట్టల నివారణ మందులు తాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
దీని కోసం 5 బృందాలను ఏర్పాటు చేశామని, ఆ బృందాలు గ్రామాలను సందర్శించి దూడలకు మందులు తాగిస్తాయని తెలిపారు.
నట్టల బెడద వల్ల దూడల్లో ఎదుగుదల తగ్గడం, రక్తహీనత, విరేచనాలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయని, సకాలంలో మందులు ఇవ్వడం వల్ల దూడలు ఆరోగ్యంగా పెరిగి భవిష్యత్తులో పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
రైతులు పశు వైద్య సిబ్బందికి సహకరించి తమ దూడలకు తప్పనిసరిగా ఉచితంగా అందించే నట్టల నివారణ మందులు తాగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లక్ష్మణ్ మేజర్ న్యూస్….