BREAKING
మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన

ఢిల్లీలో గర్జించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి దయానంద్

Select Suryaa Now
ఢిల్లీలో గర్జించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి దయానంద్

ఓటు చోరీకి వ్యతిరేకంగా ఒక్కటైన భారతదేశం...

ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ....

ఢిల్లీ వేదికగా తన గళాన్ని వినిపించిన  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్....

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
(కిరణ్ కుమార్ ఆరిక )
ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని తన గళాన్ని వినిపించారు. ఢిల్లీ వేదికగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల సంరక్షణ లక్ష్యంగా రాహుల్ గాంధీ  నాయకత్వంలో ఢిల్లీలో నిర్వహించిన భారీ ర్యాలీలో కొన్ని శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు.
ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ర్యాలీలో నాయకులు డిమాండ్ చేశారు. సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సహచర ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్,పలువురు ప్రముఖులు, పసుమర్తి విశ్వనాథ్ అధ్యక్షులు సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  డప్పు వాయిస్తూ, ఓటు చోరీకి వ్యతిరేకంగా పాట పాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి తన గళాన్ని వినిపించారు.
ఓటు చోరీతో అధికారంలోకి వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు క్షమాపణ చెప్పాలని  కాంగ్రెస్ పార్టీ నినదించింది. రాహుల్ గాంధీ  నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఢిల్లీ వేదికగా తన నిరసన గళాన్ని వినిపించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మరోసారి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు తన నిబద్ధతను చాటుకున్నారు.