దౌల్తాబాద్ నర్సాపూర్ రోడ్డుపై మిషన్ భగీరథ నీళ్లు లీకేజీ
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ నర్సాపూర్ మెయిన్ రోడ్డుపై మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో మంచినీరు విపరీతంగా రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. అధిక ఒత్తిడితో నీరు బయటకు వస్తుండటంతో పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇలాంటి లీకేజీల వల్ల వేలాది లీటర్ల నీరు రోడ్డు పాలుకావడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభం సమీపంలోనే నీరు భారీగా లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత మిషన్ భగీరథ అధికారులు మరియు సిబ్బంది తక్షణమే స్పందించి, పైప్‌లైన్ లీకేజీని అరికట్టి మరమ్మతు పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు