BREAKING
శమీ పూజ లో పాల్గొన్న సాయిబాబా దంపతులు స్థానిక ఎన్నికల్లో ఆరు మండలాల్లో కాంగ్రెస్ పోటీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు సాధువెల్లిలో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం సూర్య కథనానికి స్పందన.. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు మూసివేత ఘనంగా దుర్గామాత విగ్రహాల ఊరేగింపు.. ఘనంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు చెంపపెట్టు ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా భక్తిశ్రద్ధల నడుమ అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు.. కోలాహలంగా శోభాయాత్రలు ఘనంగా రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ అభివృద్ధిని చూడాలి చిరు వ్యాపారాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు స్థానిక ఎన్నికలపై మంత్రి 'గొట్టిపాటి' సమీక్ష

దసరా పండుగతో స్నేహితుల ఆత్మీయ ఆలింగనం!

Select Suryaa Now
దసరా పండుగతో స్నేహితుల ఆత్మీయ ఆలింగనం!

కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం వ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు కొత్త బట్టలు ధరించి, పాలపిట్టను దర్శించుకొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి స్నేహితులు, బంధుమిత్రులకు అందజేస్తూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పాలపిట్ట దర్శనం.. శుభసూచకం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో విజయదశమికి ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన పాలపిట్టను దర్శించుకోవడం శుభప్రదమని ప్రజలు సంప్రదాయంగా విశ్వసిస్తారు. పాలపిట్టను విజయం, శుభారంభాలకు సంకేతంగా భావిస్తూ తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.జమ్మి ఆకులే బంగారం.. ఆత్మీయతకు చిరునామా దసరా రోజున జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకులను బంగారంగా భావించి పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. స్నేహితులు, బంధువులు, పెద్దలను కలిసి జమ్మి ఆకులు అందిస్తూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఈ సంప్రదాయం స్నేహబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రేమాభిమానాలు, ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తోంది.