BREAKING
ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు!

Select Suryaa Now
 నేరేడ్‌మెట్ పరిధిలో ఘనంగా దేవీ నవరాత్రులు: కాలనీల మండపాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు!

సూర్య సిటీ డెస్క్, మల్కాజిగిరి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు కాలనీలలో కొలువుదీరిన అమ్మవారి మండపాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేరేడ్‌మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా భర్త కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.ఆర్. ప్రసాద్‌తో కలిసి దర్శించుకున్నారు.

మండపాలకు విచ్చేసిన నేతలు జగన్మాతకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు, అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కాలనీ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, డివిజన్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు అమ్మవారిని ప్రార్థించారు. యువత, కాలనీవాసులు ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయా ఉత్సవ కమిటీల నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీల ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.