telangana
చోరీ కేసును బిచ్కుంద ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : బిచ్కుంద గ్రామానికి చెందిన సుంకరి సాయవ్వ ఈ నెల 14వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు. ఆమె ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన నిందితులు చోరీకి పథకం వేశారు. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, పెట్టెలో దాచిన రూ.15,000 నగదును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో, బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, బిచ్కుంద ఎస్‌హెచ్‌ఓ రాజు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు స్థానిక సమాచారం ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
23.10.2026 నాడు సాయంత్రం బిచ్కుంద పోలీసులు రాజూళ్ల చౌరస్తా, పరమేశ్వర థియేటర్ సమీపంలో గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది.నిందితులు మద్యానికి అలవాటుపడి, డబ్బుల కోసం చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన ఒక ఇనుప రాడ్‌తో పాటు చోరీ చేసిన నగదులో మిగిలిన రూ.12,000ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.ఈ చోరీ కేసును సమర్థవంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసిన బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌హెచ్‌ఓ రాజు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అభినందించారు. నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.