BREAKING
తొలి టెస్ట్ డ్రా.. కివీస్ పట్టుదలతో భారత్‌కు నిరాశ ఇండోనేషియా క్యాండీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం, 24 మృతదేహాల వెలికితీత.. అభివృద్ధి పనులతో శ్రీకృష్ణ నగర్ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ నవంబర్ 25న నయీ చేతన ఐదో ఎడిషన్ ప్రారంభం అయ్యప్ప స్వామి సేవతో మనసుకు ప్రశాంతత: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్* పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలపై దాడుల కలకలం: సప్లై చైన్ ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకు ఒత్తిడి! వైజయంతి మ్యూజిక్ కన్సర్వేటరీకి 30 ఏళ్లు.. ఆడియో ల్యాబొరేటరీస్ ప్రారంభం అశ్వారావుపేటలో కార్డెన్ సెర్చ్..* 17 ఏళ్లుగా ఉద్యోగం కోసం పోరాటం.. న్యాయం చేయాలని దళితుడి వేడుకోలు కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య బాలికల రక్షణకు ప్రతి డోసూ కీలక అడుగు: ప్రధాని మోదీ దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు: 25,912 పాయింట్ల వద్ద గిఫ్ట్ నిఫ్టీ.. ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల జోరుతో లాభాల బాట మానవత్వానికి మ్యానిఫెస్టో ‘చీకటి తరువాత’ నవల - కె. శ్రీనివాస్ టాటా స్టీల్ - ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మెగా ఒప్పందం... చిన్నారుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం: దేవిరెడ్డి నాగార్జునరెడ్డి

కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై..  బిఆర్ఎస్ పోరుబాట

నిరసన ప్రదర్శన చేసిన గులాబీ దళం

హామీలు నెరవేర్చాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ..మణుగూరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ...బిఆర్ఎస్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు హామీలను నెరవేర్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు.పార్టీ పిలుపు మేరకు బుధవారం నుండి ఈ నెల 8 వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలతో గులాబీ శ్రేణులు పోరుబాట పట్టారు.

నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాల నుండి వచ్చిన గులాబీ దళం భారీ ప్రదర్శన నిర్వహించారు.తహశీల్దార్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించిన అనంతరం రెవిన్యూ అధికారులకు కాంగ్రెస్ హామీ మోసాలపై వినతి పత్రం సమర్పించారు.బిఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.