BREAKING
ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి విషాదం: 10 మంది పౌరుల దుర్మరణం..మృత్యుంజయుడిగా బయటపడ్డ చిన్నారి అంబటి సాహిత్యం ఫై సదస్సు.... అయోవాలో సీసం నిల్వలను పేల్చివేయాలన్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై కలకలం... ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

అయ్యప్ప స్వామి సేవతో మనసుకు ప్రశాంతత: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్*

Select Suryaa Now
అయ్యప్ప స్వామి సేవతో మనసుకు ప్రశాంతత: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్*
 కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్   ఆధ్యాత్మికతతోనే మనిషిలో మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన పెంపొందుతాయని, అయ్యప్ప స్వామి సేవతో మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. ఆదివారం బాచుపల్లి తన్వి హిల్స్‌లో వంశీ, కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని హరిహరసుతుడు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప మార్గం భక్తితో పాటు క్రమశిక్షణ, నియమ నిష్ఠలు, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని తెలిపారు. మనలోని దుర్గుణాలను విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మహాపడి పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు రవికిరణ్, బాలాజీ నాయక్, నాయకులు సాంబశివరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.