BREAKING
ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి విషాదం: 10 మంది పౌరుల దుర్మరణం..మృత్యుంజయుడిగా బయటపడ్డ చిన్నారి అంబటి సాహిత్యం ఫై సదస్సు.... అయోవాలో సీసం నిల్వలను పేల్చివేయాలన్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై కలకలం... ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

అభివృద్ధి పనులతో శ్రీకృష్ణ నగర్ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

Select Suryaa Now
అభివృద్ధి పనులతో శ్రీకృష్ణ నగర్ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
 కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్  మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ శ్రీకృష్ణ నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. ఆదివారం 129-సూరారం డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్‌లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు ఉన్న శ్రీకృష్ణ నగర్‌కు, ప్రస్తుతం ఉన్న శ్రీకృష్ణ నగర్‌కు అభివృద్ధి విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి రోజు నుంచే ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోట్లాది రూపాయల నిధులతో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాంత అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. కుత్బుల్లాపూర్ ప్రజలు తనపై నమ్మకంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించారని, ప్రజల అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కేపీ. వివేకానంద్ అన్నారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, కాలనీ అధ్యక్షుడు బషీరుద్దీన్, మాజీ అధ్యక్షులు దారం సత్యనారాయణ గుప్తా, దారం శివా గుప్తా, కోశాధికారి ఖళీం, సభ్యులు సంధ్యారాణి, లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, అబ్బాస్, మాణిక్యం, త్రినాథ్ రావు, మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, సీనియర్ నాయకులు వారాల వినోద్, మధుమోహన్, ఫిరోజ్, కొండకళ్ల శ్రీనివాస్ రెడ్డి, కోల శ్రీకాంత్ ముదిరాజ్, సాజిద్, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సురేష్, మహిళా నాయకురాలు లతారెడ్డి, అమృత లక్ష్మమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు