BREAKING
ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి విషాదం: 10 మంది పౌరుల దుర్మరణం..మృత్యుంజయుడిగా బయటపడ్డ చిన్నారి అంబటి సాహిత్యం ఫై సదస్సు.... అయోవాలో సీసం నిల్వలను పేల్చివేయాలన్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై కలకలం... ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

అశ్వారావుపేటలో కార్డెన్ సెర్చ్..*

Select Suryaa Now
అశ్వారావుపేటలో కార్డెన్ సెర్చ్..*

*సూర్య ఆర్ సి అశ్వారావుపేట,* అశ్వారావుపేట పట్టణంలోని నందమూరి కాలనీలో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనతో ఈ కార్యక్రమం చేపట్టారు.అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 120 ఇళ్లను సోదా చేశారు. అలాగే 54 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్ల డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. వాటిలో డాక్యుమెంట్లు సరిగా లేని 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.అంతేకాకుండా ఒక బెల్ట్ షాపులో తనిఖీలు చేయగా 64 క్వార్టర్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా నందమూరి కాలనీ వాసులకు పోలీసులు అవగాహన కల్పించారు. గంజాయి, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. వాటి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.రాబోయే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరూ జూద శిబిరాలు నిర్వహించవద్దని, అందులో పాల్గొనవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అలా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ గంజాయి బారిన పడకుండా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ, అశ్వారావుపేట ఎస్ఐలు, దమ్మపేట ఎస్ఐ మరియు అశ్వారావుపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట