BREAKING
ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి విషాదం: 10 మంది పౌరుల దుర్మరణం..మృత్యుంజయుడిగా బయటపడ్డ చిన్నారి అంబటి సాహిత్యం ఫై సదస్సు.... అయోవాలో సీసం నిల్వలను పేల్చివేయాలన్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై కలకలం... ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

17 ఏళ్లుగా ఉద్యోగం కోసం పోరాటం.. న్యాయం చేయాలని దళితుడి వేడుకోలు

Select Suryaa Now
17 ఏళ్లుగా ఉద్యోగం కోసం పోరాటం.. న్యాయం చేయాలని దళితుడి వేడుకోలు
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :గత 17 ఏళ్లుగా ఉద్యోగం, జీతాల బకాయిల కోసం పోరాడుతున్న తనకు న్యాయం చేసి ఉద్యోగం కల్పించాలని ఓ దళిత బాధితుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు, అధికారులు దళితుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడి మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి, రక్షణ, సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే ఆయా వర్గాలను గుర్తుచేసుకుంటున్న ప్రభుత్వాలు, అనంతరం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రొఫెసర్ దుర్గేశ్వర్ మార్గదర్శకత్వంలో తన సమస్యకు సంబంధించిన నివేదికలు సిద్ధమైనట్లు పేర్కొంటూ, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని కోరారు. వేధింపులు, వివక్ష కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని, తనలాంటి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు దళితులకు న్యాయం చేసి, తనకు జీవించే భరోసా కల్పించాలని వేడుకున్నారు.