భక్తిభావంతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన శంభీపూర్ క్రిష్ణ
దుండిగల్ మేజర్ న్యూస్ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని ఆదివారం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలు, అమ్మవారి మండపాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అమరం గోపాల్ రెడ్డి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి క్రిష్ణ, మాజీ సర్పంచ్ కావలి గణేష్, పీఏసీఎస్ డైరెక్టర్లు జీతయ్య, ఈ. శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.