BREAKING
భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

Select Suryaa Now
బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
సూర్య, భీమ్‌గల్  భీమ్‌గల్ మండల కేంద్రంలో ఇటీవల సుధాకర్ (60) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి బలవన్మరణం చెందగా, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. భీమ్‌గల్ తహసిల్దార్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుని సతీమణి సరోజ, కుమారుడు శ్రీనివాస్ లకు ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠిల చేతుల మీదుగా రూ. 5లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,  మున్సిపల్ చైర్మన్ నాగమణి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,బాల్కొండ  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్ కిరణ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.