అర్ధరాత్రి వేళ వైన్స్‌లో దొంగల హల్‌చల్
సూర్య ఎండపల్లి:జగిత్యాల జిల్లా ఎండపల్లిలో అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. స్థానికంగా ఉన్న సోమేశ్వర వైన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు, వైన్స్ వెనుకవైపు తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. చోరీలో ఎంతమేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది.