BREAKING
కృష్ణానదిలో వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి ఉల్లిపాలెంలో విషాదఛాయలు.. కుటుంబ సభ్యుల రోదనలు వార్షిక గది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచిన మేరియట్ ఇంటర్నేషనల్ మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..గల్ఫ్ దేశాలలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ భయాలు పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి... హంగేరి రాజకీయాల్లో కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన అధికార పార్టీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. 'సెంపాయింట్ పార్టనర్స్' పేరుతో కొత్త ప్రాక్సీ సొలిసిటింగ్ సంస్థను ప్రారంభించిన అనుభవజ్ఞులు వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా సోమాలియా నుంచి సైనిక ఉపసంహరణ ప్రారంభించిన ఉగాండా ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత పులివెందుల ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లపై దాడులపై విచారణకు ఆదేశాలు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి ప్రజావాణి ఎదుట బాధితుల ధర్నా.. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్

Select Suryaa Now
అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి  ప్రజావాణి ఎదుట బాధితుల ధర్నా.. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్

 

సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

 ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అక్రమాలకు, మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిన గుడిపాటి (ఊకంటి) వీణావాణిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జూలపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట పలువురు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.

జూలపల్లి మండలం వడకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వీణావాణి విద్యాశాఖ అధికారులను మోసం చేస్తూ, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా పొందినట్లు రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేసినట్లు నిరసనకారులు తెలిపారు. ఈ వ్యవహారంపై మండల విద్యాధికారి నిర్వహించిన విచారణలో అక్రమాలు జరిగినట్లు వెల్లడైనప్పటికీ, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను మోసం చేసి ప్రజాధనానికి నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నందున వీణావాణిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ ధర్నాలో గొల్లపల్లి రాంరెడ్డి, పెద్దోళ్ల ఐలయ్య, కొమ్మ ఐలయ్య, దొడ్ల రాజయ్య, తీగల అశోక్, మల్లెత్తుల అంజి యాదవ్, మేరుగు కనకయ్య, ఐల నరేష్, అమరగాని వేణు, ఎల్లేష్, అమరగాని హరీష్ తదితరులు పాల్గొన్నారు.