అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా
సూర్య రాజన్న సిరిసిల్ల..జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు.
ఈఆపరేషన్‌లో భాగంగా పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానిత ప్రాంతాల్లోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటుగా అనుమానిత వ్యక్తులకు గంజాయి గుర్తింపు కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు.ఈసందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురిపై మూడు కేసులు నమోదు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 15 మందిపై , అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై ఐదు కేసులు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న మూడు డీజే సౌండ్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న రెండు బోర్‌వెల్ లారీలు, ఒక కారుపై కూడా కేసులు నమోదు చేశారు.ప్రజాభద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈసందర్భంగా డిఎస్పీ తెలిపారు.ఈఅపరేషన్ లో సిఐ లు శ్రీనివాస్ , నాగేశ్వరరావు, ఎస్.ఐ లు , సిబ్బంది పాల్గొన్నారు.