అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించం - టిజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : " ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆర్టీసీ యూనియన్ వెరిఫికేషన్ లో క్లాజ్ 3 రాష్ట్ర గుర్తింపు మెజారిటీ ఓట్లు వచ్చిన వారికి గుర్తింపు ఇస్తారు, క్లాజ్ 6 లో 51శాతం ఓట్లు వచ్చిన యూనియన్ కు రీజియన్ గుర్తింపు ఇచ్చారు. అలా 51 శాతం రాని పక్షంలో రాష్ట్ర గుర్తింపు ఏ యూనియన్కి వస్తే ఆ యూనియన్ కు ఆ రీజియన్ కేటాయిస్తారు. అలా గుర్తింపు కేటాయిస్తారు .
అదే సర్కులర్ కొనసాగుతుంది. కానీ అన్నీ తెలిసిన లేబర్ కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడం ఇష్టమున్నట్టు గుర్తింపు కేటాయించడం సరి అయినది కాదు" అని టిజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అన్నారు . టి ఎమ్ యూ గుర్తును కూడా టి డబ్ల్యూ యు కు కేటాయించడం ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు ప్రకటించడం చూస్తుంటే కావాలని అవక అవకలకు పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు .
అధికారం ఉంటే అడ్డగోలుగా అధికారం కట్ట పెట్టవచ్చా ఏమైనా చేయవచ్చా? ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహించారు? ఎన్నికలు పెట్టకుండా మీరు అనుకున్నవారికి అధికారం ఇస్తే సరిపోయేది కదా ! ఇదేనా న్యాయమంటే దీన్ని ప్రతి ఒక్కరూ ఎదించాల్సిన అవసరం ఉంది అని టిజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అన్నారు .
గతంలో జరిగిన ఆర్టీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు కనీసం 40 రోజులు సమయంతో నోటిఫికేషన్ ఇచ్చేవారు. అలా కాకుండా 20 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆదరా బాదరగా ఎన్నికలు జరిపించడం చూస్తుంటే అక్రమంగా అధికారం కట్ట పెట్టాలని చూడడం స్పష్టంగా కనిపిస్తుందన్నారు . అన్ని రకాల తప్పులకు పాల్పడిన అధికారి పైన ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని ఈ ఎన్నికలను మొత్తం రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని యాజమాన్యాన్ని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు .