ఆటోను ఢీకొన్న కారు..12 మందికి గాయాలు.
ఆటోను ఢీకొన్న కారు..12 మందికి గాయాలు.
* నలుగురికి తీవ్ర గాయాలు..భద్రాచలం ఆస్పత్రికి తరలింపు.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
మండల పరిధిలోని చిన్న నల్లబల్లి గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి.ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చర్ల మండలం పులిగుండాల గ్రామానికి చెందిన కొందరు ఆదివాసీ గిరిజనులు ఆటోలో చిన్న నల్లబల్లి వద్ద ఉన్న ఓ చర్చికి బయలుదేరారు.ప్రధాన రహదారి నుంచి చర్చి వైపునకు ఆటోను మలుపు తిప్పుతుండగా భద్రాచలం నుంచి పర్ణశాల వైపు వేగంగా వెళ్తున్న కారు ఆటోను వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సీతారాములు అనే వ్యక్తికి కాలు విరగగా,భద్రమ్మ, వీరమ్మ,మౌనికలకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని వెంటనే మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన బాధితులకు ములకపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం వారిని కూడా 108 అత్యవసర వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న దుమ్ముగూడెం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.