ఆర్‌టీసీ బస్సులు ప్రారంభించాలి: పిలక వెంకటరమణారెడ్డి.
ఆర్‌టీసీ బస్సులు ప్రారంభించాలి: పిలక వెంకటరమణారెడ్డి.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
చర్ల నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితో పాటు గుంటూరుకు ఆర్‌టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనగరం గ్రామానికి చెందిన పిలక వెంకటరమణారెడ్డి భద్రాచలం ఆర్‌టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.చర్ల, దుమ్ముగూడెం నుంచి కూకట్‌పల్లికి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యులు, విద్యార్థులు,ఉద్యోగుల సౌకర్యార్థం చర్ల - కూకట్‌పల్లి మధ్య సూపర్ లగ్జరీ లేదా డీలక్స్ బస్సు అప్ & డౌన్ సర్వీస్‌ను అలాగే గుంటూరుకు కొత్త బస్సును తక్షణమే పునరుద్ధరించాలని డీఎంను కోరారు.