BREAKING
శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా?

ఆదర్శ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ

Select Suryaa Now
ఆదర్శ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ

 


ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కుమారస్వామి

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సేవా కార్యక్రమం

మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

చింతపల్లి మేజర్ న్యూస్. నల్లగొండ జిల్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా చింతపల్లి మండలంలోని ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, చింతపల్లి మండల శాఖ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు. కుమారస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశ సేవ, ధర్మ పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం మోదీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అక్టోబర్‌ 4న రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన, అక్టోబర్‌ 9న అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 11న గ్రామాలు, బస్తీలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వీడియోలు, చిత్రాలను సేకరించి ప్రచారం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు .రమేష్‌ యాదవ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుకుడపు .రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి యనం. శేఖర్‌, వార్డు సభ్యులు నల్ల సైదులు, సోమరాజు, ప్రదీప్‌, గజ్జి అభినవ్‌, దండేటికారు మహేష్‌, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు సైదులు, మోహన్‌రెడ్డి, ఎస్‌.ఎస్‌.చారి తదితరులు పాల్గొన్నారు.