1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సూర్య రాజంపేట:రాజంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులుకామారెడ్డి జిల్లా కేంద్రంలోని చంద్ర రెస్టారెంట్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత పాత స్నేహితులంతా ఒకేచోట కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, చదువుకున్న రోజుల్లో జరిగిన సరదా సంఘటనలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. నాటి స్నేహితులు, ఉపాధ్యాయులతో ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. విద్యను అందించిన పాఠశాలలోనే సమావేశం కావడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలతో పాత స్నేహబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు.