యువకుడి దారుణ హత్య
ఎదురుగడ్డలో యువకుడి దారుణ హత్య
- విచక్షణారహితంగా దాడి
కొత్తగూడెం క్రైమ్, సూర్య (మేజర్ న్యూస్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో యువకుడు ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో యువకుడిని దారి కాచి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. యువకుడి ఒంటిపై 15 కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. చనిపోయిన యువకుడు అఖిల్ (21)గా గుర్తించారు. అఖిల్ ఎదురుగడ్డలోని స్థానికంగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉంటున్న యువకులు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల ఆధిపత్య పోరులో అఖిల్ ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడిపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి అఖిల్ కి స్థానిక యువకులకు మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని పలువురు భావిస్తున్నారు.