ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు - వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి
ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు- వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప
- టిడిపి నాయకులు పత్రాలు చింపేస్తుంటే అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించిన శిల్ప
- తల్లి కుల ధృవీకరణ పత్రం చెల్లితే కుమార్తె ది చెల్లదా
- ఎన్ని అడ్డంకులు వచ్చినా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తాం
ఆత్మకూర్, మేజర్ న్యూస్: టిడిపి నాయకులు ఆత్మకు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైసిపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక బాయి కుల ధ్రువీకరణ పత్రం చింపివేశారని శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. మూడు రోజులపాటు జరిగిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైసిపి పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రియాంక బాయి తో పాటు ఐదు నామినేషన్లు, కౌన్సిలర్ అభ్యర్థులుగా 105 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కుల ధ్రువీకరణ పత్రం చెల్లదంటూ టిడిపి నాయకులు చింపి వేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోగా లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శిల్ప పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ ఓటమి భయంతోనే టిడిపి నాయకులు నామినేషన్లు చెల్లకుండా చేస్తున్నారని అన్నారు. డాక్టర్ ప్రియాంక బాయి కులదవీకరణ పత్రం చింపివేయడం ఏమిటని అక్కడున్న అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని వెల్లడించారు.