BREAKING
29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ...... నగరంలో కూటమి ప్రచార బేరి

రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌కు ఘన స్వాగతం

Select Suryaa Now
రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌కు ఘన స్వాగతం

 సూర్య కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ అన్నగారు కరీంనగర్ జిల్లాకు విచ్చేసి టీఎన్జీవోల భవనాన్ని సందర్శించిన సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో పాటు ముందస్తు విజయదశమి దసరా శుభాకాంక్షలను పుష్పగుచ్ఛం, శాలువాతో అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, సద్దుల బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అతిపెద్ద పండుగ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పూలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజిస్తారని, కానీ తెలంగాణలో పూలనే బతుకమ్మగా పేర్చి దేవతా స్వరూపంగా ఆరాధించడం మన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆడబిడ్డలను గౌరవిస్తూ, ప్రకృతిని పూజిస్తూ, కుటుంబ బంధాలను, ఆత్మీయతను చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని వివరించారు. ఈ పండుగలను ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఇటీవల మైనారిటీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ జలాలుద్దీన్ అక్బర్ మర్యాదపూర్వకంగా టీఎన్జీవోల భవనానికి విచ్చేసి రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి తదితర ఉద్యోగ సంఘ నాయకులను కలిశారు. టీఎన్జీవో సంఘంలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగులకు సేవలందించిన అక్బర్ ప్రస్తుతం టీజీవో సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాయకులతో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు సర్దార్ హరేమేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్, గంగారపు రమేష్, లవకుమార్, రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు కిషన్ సుధాకర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదే సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు తమ పదోన్నతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘాలు నిరంతరం కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ, దసరా పండుగలను ఐకమత్యంతో, సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర, జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు యావత్తు ఉద్యోగ లోకానికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.