BREAKING
ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి

పోలీసులకు బందోబస్తు ఒత్తిడి.. • పండగ పూటా విశ్రాంతి కరువు!

Select Suryaa Now
పోలీసులకు బందోబస్తు ఒత్తిడి.. • పండగ పూటా విశ్రాంతి కరువు!

మంచిర్యాల జిల్లా, సూర్య ప్రతినిధి : నియోజకవర్గంలో వరుస ఘటనలు, రాజకీయ వర్గాల మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు తీవ్ర ఎండ, మరోవైపు వరుస విధులతో పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పండగ వేళ కూడా ప్రశాంతంగా భోజనం చేసే సమయం లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది.

నిన్న రాత్రి బతుకమ్మ వేడుకల సందర్భంగా బందోబస్తు నిర్వహించిన పోలీసులు, తాళ్లపేటలో చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి, మంతెన జగన్ మోహన్ రావుకు మధ్య ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా.. వాటి ప్రభావం పోలీసుల విధులపై పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులు వరుస బందోబస్తు విధులతో విశ్రాంతికి కూడా దూరమవుతున్నారు. రాజకీయ విభేదాలు ప్రజా ప్రశాంతతకు విఘాతం కలిగించకుండా నాయకులు సంయమనం పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులపై అదనపు పని ఒత్తిడి తగ్గేలా రాజకీయ నాయకులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.