'ప్రేమలు 2' సినిమా ఆగిపోవడంపై స్పందించిన దర్శకుడు గిరీష్ ఏడీ.. అసలు కారణం అదేనా!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళంలో సంచలన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ప్రేమలు' చిత్రానికి సీక్వెల్ రానుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రేమలు 2' సినిమా నిలిచిపోయిందనే ప్రచారంపై స్పందించిన దర్శకుడు గిరీష్ ఏడీ స్పష్టతనిచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఊహాగానాలపై ఆయన మీడియాతో మాట్లాడతూ అసలు విషయాలను పంచుకున్నారు.
సినిమా ఆగిపోయిందనే వార్తలు తమ టీమ్‌కు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని గిరీష్ ఏడీ పేర్కొన్నారు. మొదటి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పూర్తితో సీక్వెల్‌ను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించాలని భావించామని తెలిపారు. అయితే అనుకున్న సమయానికి స్క్రిప్ట్ పనులు ఆశించిన విధంగా పూర్తికాకపోవడం మరియు నటీనటుల డేట్స్ సర్దుబాటు కాకపోవడం వంటి కొన్ని సాంకేతిక కారణాల వల్లనే పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. అంతేకానీ సినిమా పూర్తిగా రద్దయిపోయిందనడంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
మొదటి భాగం అందించిన బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెట్టేలా బలమైన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నామని, అందుకే కొంత ఎక్కువ సమయం పడుతోందని గిరీష్ ఏడీ వెల్లడించారు. కథా చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, సరైన సమయం వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వెలువరిస్తామని తెలిపారు. దర్శకుడి క్లారిటీతో 'ప్రేమలు 2' సినిమాపై నెలకొన్న అనుమానాలు తొలిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: చిరస్మరణీయుడు మొరిశెట్టి…