BREAKING
కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోల్‌కతా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కులు అందజేసిన సీఎం సువేందు అధికారి సీఎం ఇంట్లో ఆయుధ పూజ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన!

శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి

Select Suryaa Now
శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి

 సూర్య కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుండగా, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 49 పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని తెలిపారు.

ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్లు 141, 142లను విడుదల చేసిందని, కామన్ గైడ్‌లైన్స్, రోస్టర్ విధానానికి అనుగుణంగా ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని పేర్కొన్నారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (హుస్నాబాద్)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 7, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 7, ఈసీఈలో 7, ఐటీలో 5, ఈఈఈలో 1, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 2, ఇంగ్లీష్‌లో 1, మ్యాథమెటిక్స్‌లో 2, ఫిజిక్స్‌లో 2, కెమిస్ట్రీలో 2, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 1, లైబ్రేరియన్ పోస్టు 1 ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో 8, ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో 2, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో 1 పోస్టు భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాలతో ఉన్నత విద్యారంగం మరింత బలోపేతం కావడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుబాటులోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.