బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై టీడీపీ శ్రేణుల దాడి?
కడప, సూర్య బ్యూరో :వైఎస్సార్ జిల్లా బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా హైడ్రామా చోటుచేసుకుంది.
కూటమి అభ్యర్థులను మినహాయించి, వైసీపీ మరియు స్వతంత్ర అభ్యర్థులను మున్సిపల్ కార్యాలయంలోకి రాకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం చుట్టూ వందలాది మంది టీడీపీ వర్గీయులు గుమిగూడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘర్షణలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం అడ్డుకుని, వారి కెమెరాలు మరియు మొబైల్ ఫోన్లు లాక్కుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో బద్వేల్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.