మహిషాసురవర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
శ్రీ సత్యసాయి జిల్లా కరస్పాండెంట్ మేజర్ న్యూస్ : బత్తలపల్లి మండలంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న దుర్గామాత సేవా సమితి ఫ్రెండ్స్ లెవెన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా.. నేడు అమ్మవారు భక్తులకు మహిషాసురవర్ధిని అవతారంలో దివ్యదర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక అలంకారంలో భక్తులకు అభయమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
అజయ్ నాయుడు సత్యసాయి జిల్లా కరస్పాండెంట్