BREAKING
'ప్రేమలు 2' సినిమా ఆగిపోవడంపై స్పందించిన దర్శకుడు గిరీష్ ఏడీ.. అసలు కారణం అదేనా! పోలీసులకు బందోబస్తు ఒత్తిడి.. • పండగ పూటా విశ్రాంతి కరువు! చిరస్మరణీయుడు మొరిశెట్టి... శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో బీజేపీ పాలకవర్గం విఫలం బావిలో పడి యువ రైతు మృతి* రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌కు ఘన స్వాగతం మేము ప్రజలకు సేవకులం.. పెత్తందారుల్లా వ్యవహరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక! నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మహిషాసురమర్ధిని అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు అగస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు! జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు శ్రీ దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అమృతతుల్యంగా అన్నప్రసాదం.. భక్తుల ప్రశంసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల

వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్వో శ్రీదేవి, ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ గురుస్వామి రెడ్డి, సర్కిల్ సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:ఎన్నికల నోటీసు జారీ మరియు ఓటర్ల జాబితా ప్రదర్శన: 21.10.2026  నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ: 23.10.2026 (ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)  నామినేషన్ల పరిశీలన తేదీ: 24.10.2026  తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీలు (ఆర్డీవో వద్ద): 25.10.2026  అప్పిలేట్ అధికారిచే అప్పీళ్ళ పరిష్కారం: 26.10.2026  అభ్యర్థిత్వముల ఉపసంహరణకు ఆఖరు తేదీ: 27.10.2026  పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ: 27.10.2026 (మధ్యాహ్నం 3.00 గంటల తరువాత)  

పోలింగ్ తేదీ: 03.11.2026  రీపోల్ ఏదైనా ఉన్నట్లయితే: 04.11.2026  ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: 05.11.2026 న ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం