BREAKING
గోనెగండ్లలో టీడీపీకి ఎదురుదెబ్బ.. వైఎస్సార్‌సీపీలోకి 30 కుటుంబాలు ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల బరిలో కాంగ్రెస్: అభ్యర్థిని కొప్పిశెట్టి పద్మకు 'బి' ఫారం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్! ఎమ్మెల్సీ సహకారంతో,ఆడేపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు - వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దుర్గాభవాని మాత మాలదారుల పాదయాత్ర రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై టీడీపీ శ్రేణుల దాడి? గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహరచన -స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేలా సన్నాహక భేటీ -ప్రచారం, సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహంపై కూటమి నేతల సుదీర్ఘ మంతనాలు -తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం : కూటమి నేతలు గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్'.. ఆహాలో స్ట్రీమింగ్! ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి మహిషాసురవర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

మేకల కాపరులపై బీట్ అధికారి దాడి!

Select Suryaa Now
మేకల కాపరులపై బీట్ అధికారి దాడి!

 

•దాడికి పాల్పడిన అధికారిపై  అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి 

• ఆదివాసీ కోయ సంఘం డిమాండ్

మంచిర్యాల, సూర్య ప్రతినిధి : మేకలు మేపేందుకు అడవికి వెళ్లిన ఇద్దరు కాపరులపై బొప్పారం బీట్ అధికారి తిరుపతి విచక్షణారహితంగా దాడి చేశారని ఆదివాసీ కోయ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయిని నగేష్ దొర ఆరోపించారు. కోటపల్లి మండలం ఆల్గామ గ్రామంలో జరిగిన ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆదివారం కోర్తె సంతోష్, సంపత్, ఓజన్న అడవిలో మేకలు మేపేందుకు వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో బీట్ అధికారి తిరుపతి తన సిబ్బందితో అక్కడికి వచ్చారని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా సంతోష్, ఓజన్నలపై దాడి చేశారని ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ అధికారి బెదిరించినట్లు పేర్కొన్నారు.

దాడిలో సంతోష్, ఓజన్నలకు తొడలు, చేతులు, నడుము భాగాల్లో గాయాలయ్యాయని, నడవలేని పరిస్థితి ఏర్పడిందని నగేష్ దొర తెలిపారు. ఆదివాసీలపై అటవీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, మేకలను ఎక్కడ మేపుకోవాలని ప్రశ్నించారు.

కాపరులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీట్ అధికారి తిరుపతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ కోయ సంఘం జిల్లా అధ్యక్షుడు చెడంక మంతయ్య, ప్రధాన కార్యదర్శి మడే సమ్మయ్య పాల్గొన్నారు.