BREAKING
ఉదయాన్నే విపరీతమైన అలసటగా ఉందా.. అయితే ఈ పోషకాల లోపం ఉన్నట్టే! హై కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండిలా.. ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు! ఘనంగా వాడపల్లి వెంకన్న అష్టోత్తర పూజలు వింత వ్యాధితో పందులు మృతి స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సంకేతాలు సూర్య సినిమా చూసి కంటతడి పెట్టుకున్న శివరాజ్ కుమార్.. ఆ చిత్రమే నన్ను కదిలించింది! నివిన్ పౌలీ, సూరిల క్రేజీ ప్రాజెక్ట్ సంచారిగా తెలుగులోకి.. ఆసక్తికరమైన కథాంశం! జుబైజాగా సీనియర్ నటి జరీనా వాహబ్.. విజయ్ సేతుపతి చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర! డబ్బు పిచ్చి ప్రేమను ఎలా బలితీస్తుంది.. కాసు గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైలైట్స్! హరిత ఉక్కు తయారీ దిశగా అడుగులు భారీగా పడిపోయిన పసిడి ధరలు.. ఫెడ్ నిర్ణయాలతో దిగొస్తున్న బంగారం Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! బలపడుతున్న అమెరికన్ డాలర్ పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ఆర్థిక ఆందోళనల నడుమ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి ఇరాన్ సంక్షోభం మరియు పెరుగుతున్న చమురు ధరలు

వింత వ్యాధితో పందులు మృతి

Select Suryaa Now
వింత వ్యాధితో పందులు మృతి

వింత వ్యాధితో పందులు మృతి!

వైరస్ పంజా... ఇతర జంతువులకు ముప్పు!

దుర్వాసనతో ఊపిరాడని గ్రామాలు

తొలగించడానికి ఇబ్బంది పడుతున్న పంచాయతీ సిబ్బంది

ముందస్తుగా పందులను తరలించాలని డిమాండ్

కాటారం, సెప్టెంబర్ 28, మేజర్ సూర్య న్యూస్:

ఒకవైపు ప్రభుత్వం పల్లెల రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా పారిశుధ్యానికి పెద్దపీట వేస్తుంటే.. క్షేత్రస్థాయి అధికారుల ఉదాసీనత వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని గ్రామాలు  అంటువ్యాధుల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. మండలంలోని కొన్ని గ్రామాలలో  గత నెల రోజులుగా పందులు వింత వ్యాధి బారిన పడి కుప్పలుకుప్పలుగా మృత్యువాత పడుతున్నాయి. జనావాసాలతో పాటు గ్రామాల్లోని పంట పొలాల వద్దే పందులు ప్రాణాలు విడుస్తుండటం, వాటి కళేబరాలను సకాలంలో తొలగించకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. రోజుల తరబడి పొలాల్లోనే కుళ్లిపోతున్న శవాల నుండి వస్తున్న తీవ్రమైన మురికి దుర్వాసనతో రైతులు, వ్యవసాయ కూలీలు చేను గట్ల వైపు వెళ్లడానికే భయపడుతున్నారు. పనుల సీజన్ లో పొలాల్లో నిలబడలేక, శ్వాస తీసుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు..

వైరస్ పంజా.. ఇతర జంతువులకూ ముప్పు!

ఈ వింత వ్యాధి తీవ్రత చూస్తుంటే గ్రామాల్లో ఏదో ఒక కొత్త వైరస్ పంజా విసిరినట్లు స్పష్టమవుతోంది. ఈ చనిపోయిన పందుల ద్వారా గ్రామాల్లోని మిగతా పెంపుడు జంతువులకు, పాడి పశువులకు సైతం ఈ మహమ్మారి సోకే ప్రమాదం పొంచి ఉందని పశుపోషకులు వణికిపోతున్నారు. ఇప్పటికే గాలి పూర్తిగా కలుషితం కావడంతో అంటువ్యాధులు ప్రబలి చిన్నపిల్లలు, వృద్ధులు ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి దాపురించింది. పల్లెల్లో ఇంతటి ‘హెల్త్ ఎమర్జెన్సీ’ వాతావరణం కనిపిస్తున్నా.. బాధ్యత గల అధికారులు మాత్రం కంటినిండా నిద్రపోతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది

స్తంభించిన వ్యవసాయ పనులు..

ప్రస్తుతం చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, పంట పొలాల గట్ల వెంబడి, బావుల సమీపంలో పందులు చనిపోతుండటం రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. కళేబరాల నుండి వస్తున్న విపరీతమైన మురికి దుర్వాసన కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు చేనులోకి అడుగుపెట్టడానికే జంకుతున్నారు. ముక్కు మూసుకుని పనులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని, శ్వాస తీసుకోవడం కూడా గగనంగా మారిందని క్షేత్రస్థాయిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బందికి తప్పని తిప్పలు..

గ్రామాల్లో కుప్పలుకుప్పలుగా చనిపోతున్న పందుల కళేబరాలను తొలగించడం స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. సరైన రక్షణ పరికరాలు (గ్లౌజులు, మాస్కులు) లేకపోవడం, తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో చనిపోయిన పందులను తీయడానికి పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఉన్న సిబ్బంది సరిపోకపోవడం, మరోవైపు కళేబరాల సంఖ్య పెరుగుతుండటంతో పారిశుధ్య నిర్వహణ పడకేసింది.


ముందస్తుగా తరలించాల్సిందే!

ఇంతటి తీవ్రమైన సమస్య నెల రోజులుగా వేధిస్తున్నా ఆయా శాఖల యంత్రాంగం కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. చనిపోతున్న పందులకు సంభవించిన వ్యాధి ఏమిటో గుర్తించడానికి ఇప్పటివరకు ఎలాంటి ల్యాబ్ పరీక్షలు జరపలేదు. కనీసం రసాయన మందులు చల్లడం, బ్లీచింగ్ చేయడం వంటి ప్రాథమిక పారిశుధ్య చర్యలు కూడా శూన్యం.ఉన్నతాధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, తక్షణమే ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించాలి. చనిపోయిన పందులను శాస్త్రీయంగా పూడ్చిపెట్టడంతో పాటు, గ్రామాల్లో మిగిలి ఉన్న పందులకు కూడా ఈ వ్యాధి సోకకముందే ముందస్తు జాగ్రత్తగా వాటిని తక్షణమే జనావాసాలు, పంట పొలాలకు దూరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు...