BREAKING
బ్యాంకుల సమ్మె వాయిదా.. ఖాతాదారులకు భారీ ఊరట బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. శుభవార్త చెప్పిన UFBU తెలంగాణలో కొత్తగా 41 బార్లకు నోటిఫికేషన్.. హైదరాబాద్‌లోనే 14 ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం నేటి రాశి ఫలాలు: 28 సెప్టెంబర్ 2026, సోమవారం.. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు నేటి పంచాంగం: 28 సెప్టెంబర్ 2026, సోమవారం.. తిథి, నక్షత్రం, శుభ మరియు అశుభ సమయాలు ఆసియా క్రీడల్లో అథ్లెట్ల పతకాల పంటతేజస్విన్, సర్వేష్, పరుల్‌లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. శుభవార్త చెప్పిన UFBU

Select Suryaa Now
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. శుభవార్త చెప్పిన UFBU

సూర్య బిజినెస్ డెస్క్: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైన బ్యాంకు ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు తలపెట్టిన సమ్మెను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో బ్యాంకు లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా యథావిధిగా సేవలు కొనసాగనున్నాయి.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో జరిగిన కీలక చర్చలు ఫలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం జరిగిన సమావేశంలో ఇరువర్గాల మధ్య పలు అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించాలనే అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది.

ఈ కమిటీ తీసుకునే నిర్ణయాల ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఉంటుందని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ స్పష్టం చేశాయి. సమస్యల పరిష్కారం కోసం చర్చల మార్గం మెరుగైన ఫలితాలనిచ్చిందని, ప్రభుత్వ మరియు యాజమాన్య స్పందనను బట్టి భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. సమ్మె విరమణ ప్రకటనతో ఖాతాదారులు, వ్యాపార వర్గాలు ఊరట చెందాయి.