వైకల్యం ఉన్న పిల్లల పట్ల వివక్ష చూపకూడదు -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక
సమాజంలో వైకల్యం గల పిల్లల పట్ల వివక్ష చూపకూడదని, ప్రత్యేక వసతులు కల్పించి వారిని అందరితో సమానంగా చూడాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ నిహారిక అన్నారు . మెంటల్ హెల్త్ డే ను పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రం లోని భవిత విలీన విద్య వనరుల కేంద్రం పాఠశాలలో గవర్నమెంట్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. చిన్నారులకు ఈ . ఎన్.టి డాక్టర్ భరద్వాజ, సైకియాట్రిస్ట్ అంబుజా, పీడియాట్రిసియన్ డా. ఉదయ్ కుమార్లు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులను ఉచ్చితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మాట్లాడుతు . నేటితరం యువత ఎంతోమంది శారీరక ,మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ఎవ్వరు అధైర్య పడవద్దని అన్నారు . కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకుడు ప్రకాష్, చిన్నారులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్ నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్