BREAKING
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు!

ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :జర్మనీ దేశంలో ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు పొందేందుకు వీలుగా అర్హులైన యువతీ, యువకులకు ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్న జర్మనీ భాష శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐ.టీ.ఐలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కలెక్టర్ గురువారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జర్మనీలో నర్సింగ్, కార్పెంటర్, ఫిజియోథెరపి వంటి అనేక రంగాలలో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశంతో ఉద్యోగాల కల్పన కోసం ఒప్పదం చేసుకుందని తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన వారికి ఉచితంగా జర్మనీ భాషలో శిక్షణ అందించేందుకు ఈ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూడు నెలల పాటు శిక్షణ అందించిన మీదట, ఉత్తీర్ణులు అయిన వారికి వీసాను సమకూర్చి జర్మనీ దేశంలో ఆకర్షణీయమైన వేతనంపై ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. మూడు నెలల పాటు కొనసాగే శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ చక్కటి ప్రావీణ్యం సాధించాలని సూచించారు. తాము పని చేసే ఉద్యోగాలలో రాణించాలంటే భాషపై పట్టు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే విధుల్లో రాణించగల్గుతారని అన్నారు. కెరీర్ లో చక్కటి ఎదుగుదలకు భాషా ప్రావీణ్యం ఎంతో దోహదపడుతుందని, మానసిక వృద్ధికి కూడా ఉపకరిస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ గా ఈ ప్రాంత ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించాలనే తపనతో తాను కూడా తెలుగు నేర్చుకున్నానని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలో జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ అధికారిణి విజేత, బాలుర, బాలికల ఐ.టి.ఐ ప్రిన్సిపాల్స్ యాదగిరి, విద్యాసాగర్, జర్మనీ భాషా బోధకుడు ధీరజ్, స్థానిక కార్పొరేటర్ జగదీశ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.