BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

టీజేఎస్‌లో చేరికల జోరు

Select Suryaa Now
టీజేఎస్‌లో చేరికల జోరు

ఘట్‌కేసర్‌లో మేడ్చల్ జిల్లా కమిటీ సమావేశం.. సర్కిళ్లకు బాధ్యుల నియామకం

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4):
తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)ను మేడ్చల్ జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి పల్లె వినయ్‌కుమార్ సూచించారు. ఆదివారం ఘట్‌కేసర్‌లో టీజేఎస్‌ మేడ్చల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, సంస్థాగత నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. మేడ్చల్ జిల్లాలోని అన్ని సర్కిళ్లకు పార్టీ బాధ్యులను నియమించారు. కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా సూరం నరసింహులును నియమించారు. ఘట్‌కేసర్ మున్సిపల్ అధ్యక్షుడిగా బచ్చు ప్రమోద్ గుప్తాను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

పలువురు టీజేఎస్‌లో చేరిక

కాగా, ఘట్‌కేసర్‌కు చెందిన కృష్ణారెడ్డి, మాణిక్యంతో పాటు పలువురు మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీజేఎస్‌లో చేరారు. వారికి పార్టీ నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరిగేలా నాయకులు కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వెంకటాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు లక్ష్మణ్, రవి, దయాకర్ గౌడ్, జాయింట్ సెక్రటరీ రాజు ముదిరాజు, కోశాధికారి సుమంత్, అధికార ప్రతినిధి ప్రవీణ్ ఆర్య, మహిళా సంఘం అధ్యక్షురాలు సుకన్యతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ గుర్రం రమేష్.