BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ

Select Suryaa Now
తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ

 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) వర్గీయులకు, మంత్రి వివేక్ ప్రధాన అనుచరుడు జగన్మోహన్ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో మహిళలు భయంతో పరుగులు తీయగా, కొందరు కిందపడి గాయపడినట్లు సమాచారం. సీఐ తమపై లాఠీతో దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, గిరిజన మహిళా సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి నిరసనకు దిగారు.

• సీఐ సస్పెన్షన్‌కు డిమాండ్‌

ఈ ఘటన నేపథ్యంలో జగన్మోహన్, జీసీసీ మాజీ చైర్మన్ కొట్నాక తిరుపతి తాళ్లపేటకు చేరుకుని తమ వర్గీయులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ రమణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పీఎస్ఆర్ వర్గీయులు బస్టాండ్ వద్ద నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా నలుమూలల నుంచి పోలీసులను రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ప్రారంభమైన వివాదం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.