సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ
రామాయంపేట ; అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయికృపా కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వినర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సంస్కృతి సంప్రదాయాలకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చడం, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆటలతో సంబరాలు జరుపుకోవడం మన సంప్రదాయంలోని ప్రత్యేకత అని తెలిపారు.
వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మన సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకలు నవీన్ సతీష్ సాత్విక్ సంతోష్ మహేష్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి. ఉబెద్. రవి. కరుణాకర్. స్వామి దేవేందర్. ప్రశాంత్ నర్సింలు దీపికా స్వప్న మేడం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు