BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

సిపిఐ,ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగానే గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ కేటాయింపు

Select Suryaa Now
సిపిఐ,ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగానే గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ కేటాయింపు

సూర్య,గుండాల గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెగ్యులర్ డాక్టర్‌ను కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరహార దీక్ష, నిరసన కార్యక్రమాల ఫలితంగానే ప్రభుత్వం గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త రెగ్యులర్ డాక్టర్‌ను కేటాయించిందని సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే షాహిద్ పేర్కొన్నారు.

గుండాల మండల ప్రజలు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని  అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం, సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిపిఐ,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళనలు నిర్వహించామని తెలిపారు.

ప్రజల ఆరోగ్య హక్కు కోసం చేపట్టిన పోరాటానికి స్పందించి రెగ్యులర్ డాక్టర్‌ను కేటాయించడం హర్షణీయమని, ఈ పరిణామం ప్రజా ఉద్యమాల శక్తిని మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చిన విజయం కాదని, ప్రజల ఐక్యత సిపిఐ, ఏఐఎస్ఎఫ్ పోరాటం వల్ల సాధించిన విజయమని స్పష్టం చేశారు.

నూతన డాక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ముఖ్యంగా పేద  గిరిజన ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలని కోరారు. గుండాల ప్రభుత్వ ఆసుపత్రిని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు తదితర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గుండాల మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ, ఏఐఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాయని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, బచ్చల రామయ్య, సాహెబ్, లక్ష్మయ్య, హరీష్, వరుణ్, నాసిర్ చందు, భద్రం, రమేష్, చిన్నరాములుతదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ యాకూబ్ గుండాల