BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే!

Select Suryaa Now
సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే!

సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే!

 -మాజీ మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :

సిద్దిపేట పట్టణం అద్దంలా మెరిసిపోతుందంటే అందులో పారిశుధ్య కార్మికుల శ్రమే ప్రధానమని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల జీతాలు పెంచకపోగా, నిత్యావసర వస్తువులు, బస్సు ఛార్జీలు, విద్యుత్ బిల్లుల భారం పెరిగిందని విమర్శించారు.

దసరా పండుగను పురస్కరించుకుని సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుధ్య కార్మికులతో హరీశ్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి అల్పాహారం చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన సొంత ఖర్చులతో మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు ప్యాంట్లు, షర్ట్లను పండుగ కానుకలుగా అందజేసి సత్కరించారు.

కార్మికుల శ్రమతోనే సిద్దిపేటకు జాతీయ గుర్తింపు

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, జాతీయ స్థాయి గుర్తింపు లభించాయంటే అది ఒక్కరి గొప్పతనం కాదని, ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న పారిశుధ్య కార్మికుల కృషి ఫలితమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల సేవలను సమాజం గుర్తించాలని అన్నారు.

గతంలో కాంగ్రెస్ పాలనలో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు అందకపోయేవని, వేతనాల కోసం కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. అప్పట్లో రూ.8,300గా ఉన్న ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దశలవారీగా రూ.12 వేలకు, రూ.14 వేలకు, చివరకు రూ.16,600కు పెంచినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి గ్రూపుల ద్వారా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జీతాలు జమయ్యే విధానాన్ని అమలు చేశామని వివరించారు.

పెరిగిన ధరలతో కార్మికులపై ఆర్థిక భారం

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, ఇళ్ల అద్దెలు, కుటుంబ ఖర్చులు పెరగడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు అన్నారు. వంటనూనె, పప్పులు, ఉల్లిపాయలు, బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా కార్మికుల వేతనాలను పెంచలేదని విమర్శించారు.

పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపుతో పాటు నల్లా ఆపరేటర్లు, మొక్కలు నాటే కార్మికులకు కూడా గ్రూపు విధానాన్ని వర్తింపజేసి నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.

పారిశుధ్య కార్మికుల శ్రమ తగ్గించేలా చర్యలు

సిద్దిపేటలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణంతో పారిశుధ్య కార్మికులపై పని భారం తగ్గిందని హరీశ్ రావు తెలిపారు. గతంలో మురుగు కాలువల్లోకి దిగి చెత్తను తొలగించాల్సి వచ్చేదని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో ఆ ఇబ్బందులు గణనీయంగా తగ్గాయని వివరించారు.

గతంలో రోడ్లపై చెత్తకుండీల చుట్టూ చెత్త పేరుకుపోవడం, పందులు సంచరించడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. చెత్తకుండీల స్థానంలో ఇంటింటికీ చెత్త సేకరణ కోసం ఆటోలు ఏర్పాటు చేయడంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. రహదారుల పరిశుభ్రత కోసం స్వీపింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి కార్మికుల శ్రమను తగ్గించే ప్రయత్నం చేశామని తెలిపారు.

మల్లన్న సాగర్‌తో నల్లా ఆపరేటర్లకు ఉపశమనం

గతంలో నీటి సరఫరా కోసం నల్లా ఆపరేటర్లు అర్ధరాత్రి, తెల్లవారుజామున సైతం పనిచేయాల్సి వచ్చేదని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా నీటి పంపిణీ సమయాలు మారడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ద్వారా సిద్దిపేటకు నీటి సరఫరా మెరుగుపడటంతో ఆపరేటర్లకు ఉపశమనం కలిగిందన్నారు. నిర్ణీత సమయాల్లో నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందులు తగ్గాయని తెలిపారు.

కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైనప్పటికీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన వారి సేవలు మరువలేనివని కొనియాడారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

మరణించిన మున్సిపల్ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ, బ్యాంకు ఖాతాల సమస్యలను అధికారులు, మున్సిపల్ చైర్మన్ సమన్వయంతో పరిష్కరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని హరీశ్ రావు సూచించారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సానుకూలంగా స్పందించాలని కోరారు.

సిద్దిపేటలో గతంతో పోలిస్తే రహదారులు, భూగర్భ డ్రైనేజీ, డివైడర్లు, పచ్చదనం, కోమటి చెరువు పరిసరాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి వెనుక కార్మికుల కృషి కీలకమని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ పురుషుల ప్రయాణ ఛార్జీల భారం పెరిగిందని, పెరుగుతున్న ఖర్చులతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు ఇతర విభాగాల కార్మికులకు గ్రూపు విధానాన్ని అమలు చేసేలా అసెంబ్లీలో పోరాడతానని స్పష్టం చేశారు.

సిద్దిపేట పట్టణ సౌందర్యం వెనుక కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని, వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.

( సూర్య అర్బన్, దేవులపల్లి భూపతి)