BREAKING
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రెయిన్వి బో ద్యార్థులు సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం

రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా చిలకమర్రి నరసింహ రెడ్డి

Select Suryaa Now
రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా చిలకమర్రి నరసింహ రెడ్డి

 

ఫరూఖ్‌నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కే. నరసింహారెడ్డి (కే. ప్రతాప్ రెడ్డి కుమారుడు) రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన బాధ్యతలు స్వీకరించిన కే. నరసింహారెడ్డి (చిలకమర్రి నరసింహారెడ్డి) షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి, తన నియామకానికి సంబంధించిన విషయాలను తెలియజేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కే. నరసింహారెడ్డి తెలిపారు. పార్టీ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంతో కాంగ్రెస్ పార్టీని అన్ని స్థాయిల్లో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఆ ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పాముల అడివయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతారం కృష్ణ భీమయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు.

జవ్వాజి రాఘవేంద్ర గౌడ్ : మేజర్ న్యూస్, షాద్ నగర్.