BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ.. మేడ్చల్ కలెక్టరేట్‌లో ఘనంగా సంబరాలు

Select Suryaa Now
ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ.. మేడ్చల్ కలెక్టరేట్‌లో ఘనంగా సంబరాలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళా ఐక్యతను చాటే ఈ పూల పండుగలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు.జిల్లా రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, భూగర్భ జల శాఖ, కీసర రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు సందడి చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.బతుకమ్మ పండుగ ప్రకృతితో మానవ సంబంధాన్ని చాటడమే కాకుండా మహిళల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రకృతిని గౌరవించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం ఈ పండుగ ప్రధాన సందేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, డెమో వసంత, మహిళా అధికారులు సారిక ప్రియ, ప్రసన్న లక్ష్మి, సంతోష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.