BREAKING
యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం మహిళల చేతుల్లో ఉపాధి మిషన్ చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు కార్మికుల దోపిడీ కేసులో మిలాన్ యుఎస్ కాన్సులేట్ నిర్మాణ సంస్థకు భారీ షాక్ మితిమీరిన స్క్రీన్ సమయం, తప్పుడు కూర్చునే భంగిమలతో చిన్నారుల వెన్నెముకకు తీవ్ర ముప్పు.. ఫిజియోథెరపీ నిపుణుల హెచ్చరిక బ్రిటన్ ఎయిర్ బేస్ సమీపంలో టెర్రరిజం యాక్ట్ కింద ఐదుగురి అరెస్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్‌ విజేతగా చెక్ రిపబ్లిక్ త్రిపుర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే చోదక శక్తిగా మారుతోంది.. ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెల్లడి కొరియా సరిహద్దు డిఎమ్‌జడ్‌లో భారీ పేలుడు టర్కీ రాజకీయంలో సంచలనం పల్లె పండుగకు రామాపురం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే బూతుల(రేవంత్)రెడ్డి సిరిసిల్ల సభ.

Select Suryaa Now
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే బూతుల(రేవంత్)రెడ్డి సిరిసిల్ల సభ.
మానకొండూర్  మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
సూర్య.ఇల్లంతకుంట. సిద్దిపేట,సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల  వస్తున్నాడని, ప్రజలకు ఒరేగబెట్టేది ఏముండదు అని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బిఆర్ఏస్ పార్టీ కార్యాలయంలో జడ్పి మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మండల పార్టీ అధ్యక్షులు పల్లే నర్సింహారెడ్డి లు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిపోతున్న తరుణంలో ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి గిసొంటి లత్కోర్ పనులు చేస్తున్నాడని విమర్శించారు .22ఏ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి నెట్టి సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై  అక్కసు వెళ్లగక్కడానికే  బూతులరెడ్డి  ప్రజాధనంతో పర్యటన చేస్తున్నారని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేయడానికి వస్తున్నాడని,ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే వస్తున్నాడని,ఒకప్పుడు సిరిసిల్ల జిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు ఉండేవి ,కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యాక జనేతన్నల కోసం 3వేల కోట్లతో పవర్ లూం  తీసుకొచ్చి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.ఒకప్పుడు కరువుతో అల్లాడిపోతున్న సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు మధ్యమానేరు  ప్రాజెక్టుతో జలకళ ఉంది తెలంగాణ కు గుండెకాయగా మారిందని తెలిపారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న పదేళ్ళలో సిరిసిల్ల రూపురేఖలు మార్చనారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన మూడేళ్ళలో ఎం అభివృద్ధి చేశారనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడటానికి ఈ సభ పెడుతున్నారని,పవర్ లూం కార్మికులకు బిల్లులు  ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు.సీఎం సభ కోసం పెట్టె ఖర్చు నేతన్నల అభ్యున్నతికి ఇస్తే బాగుంటుందని,నాడు సీమాంధ్ర పాలనలో ఎలా ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన గురువు  చంద్రబాబు సలహాలతో  కుట్ర చేస్తున్నారన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ  మూడేళ్ళలో నయాపైసా అభివృద్ధి చేయలేదని అన్నారు.కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చిన సంగతి తెలుసనీ,కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు  కాలేదన్నారు.కేసీఆర్ సీఎం హోదాలో సిద్దిపేట లో అభివృద్ధి పనుల ప్రారంభించడానికి వచ్చన్నప్పుడు సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు వరుసల రోడ్డు మజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మళ్లీ రోడ్డు మంజూరు చేసుకుని రావాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఇప్పుడు నీళ్లు ఎట్లా  ఎత్తిపోస్తున్నారని, మేడిగడ్డ దగ్గర వేలాది క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి సర్పంచ్ ల పట్ల కక్ష్యపూరిత దొరణీతో వ్యవహరిస్తున్నాడు.పేదోళ్లకు రావాల్సిన కల్యాణలక్ష్మీ, సీఏంఆర్ఎఫ్ చెక్కులను ప్రతిపక్ష సర్పంచ్ లకు ఇవ్వడం కుదరదని ఎమ్మెల్యే కవ్వంపల్లి బెదిరింపులు చేస్తున్నారన్నారు.మాజీ సర్పంచ్ లకు 100 రోజుల్లోనే బిల్లులు ఇస్తామని చెప్పి వెయ్యి రోజులైనా ఇవ్వడం ల్లి సత్యనారాయణ రద్దు చేయించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె ర్సిరెడ్డి, సెస్ రెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు చేరుకుపెళ్లి రాజిరెడ్డి,ఇల్లంతకుంట ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ గొడుగు తిరుతి, గాలిపల్లి సర్పచ్ బద్దం శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బొల్లం వెంకటేశం, ర్యాగటి రమేష్,నాగరాజు,  రాములు యాదవ్,పత్రి అంజయ్య, కూనబోయున రఘు, పట్నం శ్రీనివాస్, నరేష్, ప్రశాంత్ రెడ్డి, పండుగ భాస్కర్, మామిడి తిరుపతి, కొట్టే వెంకన్న,  నాగుల సాయి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.