పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు
పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు.. ప్రేరక పాఠశాలలో పండుగ శోభ.
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయాంజల్ డివిజన్ రాఘవేంద్ర నగర్ కాలనీలోని ప్రేరక –ది స్కూల్ ఆఫ్ చేంజ్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ప్రకృతి పరిరక్షణ, మహిళల గౌరవం, ఐకమత్యం, సామాజిక సామరస్యం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడం విద్యలో ముఖ్యమైన భాగమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.రవికుమార్, కో-ఆర్డినేటర్ పి.భవాని, వైస్ ప్రిన్సిపల్ మల్లేశ్వరి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- ఎడ్ల వెంకటేష్ గౌడ్ మేజర్ న్యూస్, తుర్కయంజాల్.